Tuesday 14th April 2026
12:07:03 PM
Home > తాజా > మల్లన్న జాతరలో చిన్నారి మృతి..నివేదిక కోరిన బీసీ కమిషన్

మల్లన్న జాతరలో చిన్నారి మృతి..నివేదిక కోరిన బీసీ కమిషన్

Telangana BC panel seeks reports over infant’s death | జిల్లా కేంద్రం అయిన నాగర్ కర్నూల్ మండలంలో కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ జాతర సమయంలో రజక సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబంపై కుల వివక్ష, ఆలయంలోకి ప్రవేశించించకుండా నిరాకరించడం వంటి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి దుర్మరణం అని వచ్చిన కథనాలపై రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ స్పందించారు. కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక అందించాలని ఎండోమెంట్ శాఖ కమిషనర్ హరీష్ కు లేఖ రాశారు.

కుల వివక్ష, బీసీ వర్గాల వారికి ఆలయంలోకి ప్రవేశించకుండా నిరాకరించడంతో జరిగిన ఘర్షణలో రెండు నెలల చిన్నారి మృతి చెందడంపై పూర్తి నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ ఛైర్మన్ కోరారు. ఘర్షణ ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కుల వివక్ష, జాతరలో ప్రవేశ రుసుము వసూలు అలాగే జాతర కోసం ఎండోమెంట్స్ శాఖ చేసిన ఏర్పాట్లపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలన్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions