Wednesday 12th August 2026
12:07:03 PM
Home > తాజా > వాహనదారులకు అలర్ట్.. మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్!

వాహనదారులకు అలర్ట్.. మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్!

traffic challans

Hyd Traffice Police Special Drive | హైదరాబాద్ (Hyderabad) నగరంలో రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేకుండా వాహనం నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయెల్ డేవిస్, ఐపీఎస్ జారీ చేసిన సూచనల ప్రకారం, ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు RTA ద్వారా వెంటనే లైసెన్స్ పొందాలని అధికారులు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇవ్వడం కూడా నేరమని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి కొందరు వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నంబరు ప్లేటును ట్యాంపర్ చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి వాహనదారులపై నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వెహికిల్ నంబర్ ప్లేట్ల అంకెలు మార్చడం, నంబరు ప్లేటుపై మాస్కులు తగిలించడం, అంకెలు స్పష్టంగా కనిపించకుండా రంగు పూయడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

భారీ జరిమానాతో పాటు క్రిమినల్‌ కేసులు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రహదారి భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి ఎన్‌ఫోర్స్‌ మెంట్ బృందాలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

You may also like
సికింద్రాబాద్ బోనాలు.. ఆగస్టు 2-4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions