Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు’.. సిట్ పిలిస్తే సహకరిస్తా: కవిత

‘నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు’.. సిట్ పిలిస్తే సహకరిస్తా: కవిత

kalvakuntla kavitha

Kavitha On SIT Investigation | తెలంగాణ రాజకీయాల్లో సంచలన  సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను కూడా సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్లవుతున్నా సిట్‌ విచారణ ముగింపునకు రావడం లేదన్న ఆమె ఈ విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె సిట్‌ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్‌ చెప్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.

సిట్‌ విచారణను తప్పుపడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చట్టం ఎవరికీ చుట్టం కాదనీ, అందరూ గౌరవించి సహకరించాలని సూచించారు. గుంట నక్కలతో కలిసి అధికార కాంగ్రెస్‌ డ్రామాలాడుతోందని ఆరోపించారు.

తనతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్‌ చేశారనే అనుమానాలున్నాయిని తెలిపారు. ఒకే వేళ సిట్‌ అధికారులు విచారణకు పిలిస్తే తప్పకుండా వెళ్లి సహకరిస్తానని కవిత వెల్లడించారు.  

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions