Wednesday 12th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బడ్జెట్..ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు

బడ్జెట్..ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు

Budget 2026 Updates | యూనియన్ బడ్జెట్ 2026-2027 లో భాగంగా ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యావరణహితమైన రవాణా వ్యవస్థలో భాగంగా వీటిని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ముంబయి-పూణే, పూణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు. వీటి ద్వారా ప్రధాన ఆర్ధిక, సాంస్కృతిక నగరాల మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు. రోడ్డు, రైలు మార్గాల్లో రద్దీని తగ్గిస్తాయని అలాగే ఇవి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions