Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > ‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’

‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’

kalvakuntla kavitha

‌- కవిత హాట్ కామెంట్స్!

Kavitha Comments On Santhosh Rao | నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Excise Constable Soumya) ను హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పరామర్శించారు.

సౌమ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌గా ఉన్నప్పటికీ కొంత మెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా సౌమ్య కుటుంబానికి జాగృతి తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు (Santhosh Rao) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కూడా చేరవేసే స్థాయిలో ఆయన పనిచేశారని వ్యాఖ్యానించారు.

ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌(KCR)కు దూరం చేసిన వ్యక్తి కూడా సంతోష్ రావేనని విమర్శించారు. ఆయన్ని ఎస్‌ఐటీ విచారించడం మంచిదేనని, అయితే శిక్ష పడుతుందా అనే అనుమానం ఉందని చెప్పారు.

కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఆయనకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదన్నారు. చట్టం నిజంగా తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా సంతోష్ రావుకు శిక్ష పడుతుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని నేను విజ్ఞప్తి చేశారు.

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions