Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పొగాకుపై పూర్తి నిషేధం..అమల్లోకి వచ్చేసింది

పొగాకుపై పూర్తి నిషేధం..అమల్లోకి వచ్చేసింది

Odisha bans all tobacco-nicotine products | పొగాకు మరియు నికోటిన్ కలిగిన అన్ని ఉత్పత్తులపై నిషేధం విధించింది ఒడిశా ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశాలో 2013 నుంచే గుట్కా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉంది. కానీ ప్రభుత్వ మార్గదర్శకాల్లోని లూప్ హోల్స్ ను వాడుకుని పొగాకు ఉత్పత్తుల దందా సాగింది.

ఈ నేపథ్యంలో తాజగా ప్రభుత్వం కఠినంగా పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుట్కా, పాన్ మసాలా, జర్దా, ఖైనీ మరియు ఇతర పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధం విధించింది. వీటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ , రవాణా, పంపిణీ మరియు విక్రయం పూర్తిగా నిషేధం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions