Tuesday 4th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దావోస్ వేదికగా రేవంత్-లోకేశ్ భేటీ

దావోస్ వేదికగా రేవంత్-లోకేశ్ భేటీ

CM Revanth Reddy-Minister Nara Lokesh Meets In Davos | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దావోస్ వేదికగా భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, అధికారులు దావోస్ లో పర్యటిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అధికారులు సైతం అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్-మంత్రి లోకేశ్ దావోస్ వేదికగా భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions