144 Section In Hyderabad | తెలంగాణలో ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 144 సెక్షన్ (144 Section) విధించారు.
మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య (Sandeep Sandilya), స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra), డీఎస్ చౌహాన్ (DS Chowhan) ఉత్తర్వులు జారీ చేశారు.
కౌంటింగ్ సెంటర్ల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమి గూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు.