Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > శ్రీశైలంలో చిరుత సంచారం..ఆయన ఇంటికి రెండవసారి

శ్రీశైలంలో చిరుత సంచారం..ఆయన ఇంటికి రెండవసారి

Cheetah Spotted In Srisailam | శ్రీశైలం శివారులో చిరుత సంచరిస్తుండడం కలకలం రేపుతోంది. ఓ పూజారి ఇంటి ఆవరణలో తాజగా చిరుత కనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం కూడా చిరుత ఈ పూజారి ఇంట్లో సంచరించింది. పాతాళగంగ మెట్ల వైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డుతో ఇల్లు నిర్మించుకున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడంతో ముందస్తు జాగ్రతలో భాగంగా బయట సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి సత్యనారాయణ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.

దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దింతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కృష్ణానది తీరం, శివారు ప్రాంతం అవ్వడంతో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ఏడాది క్రితం అంటే జనవరి 6 2025లో కూడా సత్యనారాయణ ఇంటి ప్రాంగణంలోకి చిరుత వచ్చింది. ఇప్పుడు ఇది రెండవ సారి.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions