Saturday 28th February 2026
12:07:03 PM
Home > క్రీడలు > కేసీఆర్ నిర్ణయాలపై తనయ కవిత సంచలన పోస్ట్

కేసీఆర్ నిర్ణయాలపై తనయ కవిత సంచలన పోస్ట్

Kalvakuntla Kavitha News | బీఆరెస్ పార్టీ కార్యక్రమాలను ఉద్దేశించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం కోసం నవంబర్ 29 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29న ‘దీక్ష దివస్’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు బీఆరెస్ పిలుపునిచ్చింది.

అలాగే కేసీఆర్ దీక్ష విరమించిన రోజు డిసెంబర్ 9న ‘విజయ్ దివస్’ గా కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు, కార్యకర్తలకు బీఆరెస్ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఓ వైపు బీఆరెస్ శ్రేణులు విజయ్ దివస్ జరుపుకుంటున్న సమయంలో కవిత ఎక్స్ వేదికగా బాంబు పేల్చారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు. ఇది ఉద్యమాల గడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నరు’ అని కవిత కీలక పోస్ట్ చేశారు.

You may also like
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్
వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
లిక్కర్ కేసులో కవితకు రిలీఫ్..కేటీఆర్ ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions