Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రష్యాలో హెలికాప్టర్ ప్రమాదం..ఎంత భయంకరంగా జరిగిందో చూడండి

రష్యాలో హెలికాప్టర్ ప్రమాదం..ఎంత భయంకరంగా జరిగిందో చూడండి

Russian helicopter loses tail before crashing in flames | రష్యా దేశంలో తాజగా జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హెలికాప్టర్ తోక భాగం విరిగిపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతూ సముద్రంపై కాసేపు గాల్లో ఎగిరింది.

ఆ తర్వాత పూర్తిగా నియంత్రణ కోల్పోవడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే కిజ్లియార్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్ కు చెందిన Ka-226 హెలికాప్టర్ కిజ్లియార్ నుంచి ఇజ్బర్ బాష్ కు బయలుదేరింది. ఈ క్రమంలో అచి-సు అనే గ్రామం వద్ద కాస్పియన్ సముద్ర తీరం వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.

తోకభాగం విరిగిపోవడంతో కాసేపు గాల్లోనే తిరుగుతూ ఆ తర్వాత అదుపుతప్పడంతో హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో కెమ్జీ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ప్రమాదం జరగడంతో వారు మరణించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రష్యన్ ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions