Sunday 14th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విదేశాల్లో ఉన్నత విద్య.. విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్!

విదేశాల్లో ఉన్నత విద్య.. విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్!

AP Govt Good News | విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనే వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించే సరికొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులైనా, ఎలాంటి పరిమితులు లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశంలోని ఐఐటీ, ఐఐఎం, నీట్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే వారికి కూడా ఈ పావలా వడ్డీకే రుణం వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశీ విద్యా రుణాలకు 4 శాతం వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూడాలని, దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని హామీ ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.  

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
pawan annamalai
పవనన్నా మీ నిర్ణయం ప్రశంసనీయంఅన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions