Sunday 13th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > H1B వీసా ఫీజుల పెంపు.. ఇండియన్స్ కి జర్మనీ బంపర్ ఆఫర్!

H1B వీసా ఫీజుల పెంపు.. ఇండియన్స్ కి జర్మనీ బంపర్ ఆఫర్!

germany

Germany Offer To Indians | అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం ఇటీవల హెచ్1 బీ వీసా ఫీజు (H1B Visa Fee) భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా ఏడాదికి లక్ష డాలర్లుగా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.

ముఖ్యంగా ఈ వీసా ఫీజు పెంపు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసా పెంపు వేళ, జర్మనీ ప్రభుత్వం భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నైపుణ్యం కలిగిన భారతీయులందరికీ తమ దేశం ఆహ్వానం పలుకుతోందని భారత్ లోని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్ మన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులందరికీ ఇదే మా ఆహ్వానం. జర్మనీ తన స్థిరమైన వలస విధానాలతో మరియు ఐటీ, మేనేజ్ మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతీయులకు గొప్ప ఉద్యోగ అవకాశాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. మా దేశంలో పనిచేసే ఇండియన్స్ జర్మన్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అత్యధిక వేతనాలు అందుకొంటూ జర్మనీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

మేం హర్డ్ వర్క్, ఉత్తమమైన వ్యక్తులకు మంచి ఉద్యోగం ఇవ్వడాన్ని విశ్వసిస్తాం. భారతీయులకు జర్మనీలో అత్యద్భుతమైన ఉద్యోగవకాశాలు పొందొచ్చని సూచించారు.ఆహ్వానం. జర్మనీ తన స్థిరమైన వలస విధానాలతో మరియు ఐటీ, మేనేజ్ మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతీయులకు గొప్ప ఉద్యోగ అవకాశాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

మా దేశంలో పనిచేసే ఇండియన్స్ జర్మన్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అత్యధిక వేతనాలు అందుకొంటూ జర్మనీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మేం హర్డ్ వర్క్, ఉత్తమమైన వ్యక్తులకు మంచి ఉద్యోగం ఇవ్వడాన్ని విశ్వసిస్తాం. భారతీయులకు జర్మనీలో అత్యద్భుతమైన ఉద్యోగవకాశాలు పొందొచ్చని సూచించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions