Wednesday 12th August 2026
12:07:03 PM
Home > తాజా > నటి సాయి పల్లవికి అరుదైన గౌరవం!

నటి సాయి పల్లవికి అరుదైన గౌరవం!

sai pallavi

Kalaimamani For Sai Pallavi | ప్రముఖ సినీ నటి సాయి పల్లవి (Sai Pallavi)కి అరుదైన గౌరవం దక్కింది. వివిధ కళారంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి గౌరవంగా తమిళనాడు  అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కళైమామణి’ (Kalaimamani) పురస్కారానికి సాయి పల్లవి ఎంపికయ్యారు.

కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన కళైమామణి పురస్కారాల విజేతలను ప్రకటించింది. ఇందులో భాగంగా, 2021 సంవత్సరానికి గాను నటి సాయి పల్లవికి ఈ అవార్డు లభించింది. ఆ

మెతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar), డైరక్టర్ ఎస్.జె. సూర్య (SJ Surya), లింగుస్వామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ తదితరులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

తమిళనాడులోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా పేరొందిన ఈ అవార్డు కింద విజేతలకు బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (CM MK Stalin) చేతుల మీదుగా విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions