Tuesday 16th June 2026
12:07:03 PM
Home > తాజా > సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం

సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం

CM Revanth Reddy News | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ క్రమంలో వనదేవతలకు 68కిలోల నిలువెత్తు బంగారం సమర్పించారు.

అనంతరం మేడారం ప్రాంత అభివృద్ధికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రాంగణ ప్రాంతాన్నంతా తిరిగి పరిశీలించారు. ఇల‌వేల్పులు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణానికి సంబంధించి చేపట్టే అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆలయ ఆవరణలో చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ కార్యక్రమాలు జరగాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా పూజారులు, ఆదివాసీ పెద్దలతో సంప్రదిస్తూ పనులు కొనసాగించాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions