Sunday 27th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘కీళడి’ కోసం..ప్రధానిని కలిసిన కమల్ హాసన్

‘కీళడి’ కోసం..ప్రధానిని కలిసిన కమల్ హాసన్

Kamal Haasan meets PM Modi | అగ్ర నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కమల్ హాసన్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రధానిని కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు ప్రజల ప్రతినిధిగా, కళాకారుడిగా తాను ప్రధానికి పలు విజ్ఞప్తుల చేసినట్లు తెలిపారు.

ఇందులో ముఖ్యంగా కీళడి యొక్క పురాతనత్వాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. తమిళ నాగరికత యొక్క గొప్పతనాన్ని, తమిళ భాష యొక్క ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే తమిళ ప్రజల ప్రయత్నాలకు సహకారం అందించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినట్లు కమల్ హాసన్ పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions