Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఎన్నిసార్లు పడిలేచినా అభిమానులే నా బలం’

‘ఎన్నిసార్లు పడిలేచినా అభిమానులే నా బలం’

Power Star Pawan Kalyan News | ఎన్నిసార్లు పడిలేచినా అభిమానులే తన బలం అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఇందులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.

తానెప్పుడూ డబ్బు, రికార్డుల కోసం సినిమాలు చేయలేదని పేర్కొన్నారు. సగటు మనిషిగా బతకడమే ఎప్పుడూ తనకిష్టం అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీమ్లా నాయక్ చిత్రం టిక్కెట్ ధర రూ. 10కి తగ్గించిందని గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఒక్క పిలుపుతో అభిమానులు అండగా నిలిచారన్నారు.

న్యాయం కోసం ధైర్యంగా నిలబడ్డారని, ఎన్నిసార్లు పడిలేచినా అభిమానులే తన బలం అని చెప్పారు. హరిహర వీరమల్లు…ధర్మం కోసం పోరాడే ఒక యోధుడి కథ అని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న సమయంలో త్రివిక్రమ్ తనకు అండగా నిలబడ్డారని, అపజయాలు కొనసాగుతున్న తరుణంలో వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు త్రివిక్రమ్ అని అన్నారు.

కష్టాల్లో ఉన్న సమయంలో తనతో జల్సా చేసి హిట్ ఇచ్చారని, త్రివిక్రమ్ రూపంలో భగవంతుడు తనకు మంచి మిత్రుడిని ఇచ్చాడని హర్షం వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions