Monday 31st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘పప్పూ నిద్ర వదులు’..జగన్ కు లోకేశ్ కౌంటర్

‘పప్పూ నిద్ర వదులు’..జగన్ కు లోకేశ్ కౌంటర్

Nara Lokesh Counter To Ys Jagan | ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదని ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి జగన్.

ఈ సందర్భంగా ‘అమాత్యా మేలుకో..పప్పూ నిద్ర వదులు’ అని ఎద్దేవా చేస్తూ పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జగన్ ఏడుపులే తమకు దీవెనలు అని అన్నారు. జగన్ ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి జగన్ కు కడుపుమంట రావడం సహజమన్నారు. వైసీపీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా జగన్ కు స్పృహ లేదన్నారు.

కోవిడ్ తరువాత 2022 సెప్టెంబర్‌లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన జగన్ తమను విమర్శించటం అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వం రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశామని, ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions