Sunday 6th September 2026
12:07:03 PM
Home > తాజా > బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా..ఎందుకంటే!

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా..ఎందుకంటే!

Inauguration of Bathukamma Kunta in Hyderabad postponed | హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు.

నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని హైడ్రా కమిషనర్ ప్రకటించారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్న మహిళలు, ప్రజలు వర్షం వల్ల ఇబ్బందులు పడకూడదని నేటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందని పేర్కొన్నారు.

ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారని కమిషనర్ స్పష్టం చేశారు. కాగా హైడ్రా ఏర్పాటు అయిన అనంతరం బతుకమ్మ కుంటలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఆ తర్వాత సుమారు రూ.7.15 కోట్లతో ఆధునీకరణ పనులను చేపట్టారు. పిల్లలు ఆదుకునేందుకు వీలుగా పార్కు, పెద్దలు కూర్చోవడానికి బెంచీలు తదితర ఏర్పాట్లు చేసింది హైడ్రా. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బతుకమ్మ కుంటలో జలకళ సంతరించుకుంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions