Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీశైలంలో కలకలం..సంచిలో బాంబులు, బుల్లెట్లు

శ్రీశైలంలో కలకలం..సంచిలో బాంబులు, బుల్లెట్లు

Bombs and Bullets Found in Srisailam | పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీశైలంలో బుల్లెట్లు, బాంబులతో కూడిన ఓ సంచి కనిపించడం కలకలం రేపుతోంది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీశైలం ఆలయం సమీపంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న డివైడర్ పై ఒక సంచి అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని ఎవరు అక్కడ వదిలేసి వెళ్లారో తెలీదు. సోమవారం మధ్యాహ్నం అటుగా వెళ్తున్న భక్తులు సంచిని గమనించి పోలీసులకు ఫోన్ చేశారు.

ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు, బాంబు స్కాడ్ సిబ్బంది సంచిని తనిఖీ చేశారు. అందులో నుండి 9 పెద్ద, నాలుగు చిన్న బుల్లెట్లు లభ్యం అయ్యాయి. అంతేకాకుండా నాలుగు బాంబులు కూడా ఉన్నాయి. వీటిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ సంచి ఎవరు వదిలేసి వెళ్ళారు, ఎందుకు వదిలేసి వెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions