Sunday 1st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వాహనదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ కు సంబంధించి కీలక ప్రకటన!

వాహనదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ కు సంబంధించి కీలక ప్రకటన!

fastag annual pass

FASTag Annual Pass | వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీలకు సంబంధించి ఓ కీలక ఆఫర్ ప్రకటించింది.

నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ లకు రూ.3 వేలు చెల్లిస్తే ఒక సంవత్సరంపాటు దేశంలో ఎక్కడైనా.. ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్పుల ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది.

ఈ మేరకు  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బుధవారం ఈ ప్రకటన చేసింది. ఆగస్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.3 వేలతో FASTag- ఆధారిత ఆనువల్ పాస్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలుల్లోకి రానుందని పేర్కొన్నారు.

ఏడాదిలో 200 ట్రిప్లు ముగిసేంత వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ స్కీమ్ యాక్టివేషన్, రీన్యూవల్ కు సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లింక్, రాజ్ మార్గ్ యాత్ర యాప్ తో పాటు NHAI, MORTH అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 

You may also like
vehicle2vehicle communication
ఇక వాహనాలూ మాట్లాడుకుంటాయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions