Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు

మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు

Sumanth Shuts Down Marriage Rumors with Mrunal | తెలుగు నటుడు సుమంత్ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. నటి మృణాల్ ఠాకూర్ తో సుమంత్ పెళ్లి జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

ఈ మేరకు వీరిద్దరూ కలిసి గతంలో దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. తాజగా జరుగుతున్న ప్రచారం పై సుమంత్ స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే వైరల్ గా మారిన ఫోటో ‘సీతారామం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిగినదని పేర్కొన్నారు.

తనకు వివాహ బంధంలోకి మరోసారి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యం లేదని సుమంత్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సుమంత్ కు గతంలో నటి కీర్తిరెడ్డి తో పెళ్లి అయ్యింది. అయితే కొంతకాలానికే వారు విడిపోయారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions