Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఆ సినిమాలో డోనాల్డ్ ట్రంప్..ఇప్పుడు బాధ పడుతున్న డైరెక్టర్’

‘ఆ సినిమాలో డోనాల్డ్ ట్రంప్..ఇప్పుడు బాధ పడుతున్న డైరెక్టర్’

Donald Trump News Latest | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల యుద్ధం ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేశారు.

అలాగే ఆయన అధ్యక్షడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఏదొక సంచలన నిర్ణయం తీసుకుంటూ విమర్శల పాలవుతున్నారు. ఇదే సమయంలో గతంలో తన సినిమాలో నటించేందుకు డోనాల్డ్ ట్రంప్ కు అవకాశం ఇవ్వడం పట్ల దర్శకుడు క్రిస్ కొలంబస్ బాధపడుతున్నారు.

క్రిస్ కొలంబస్ దర్శకత్వం వహించిన ‘హోమ్ అలోన్ టూ: లాస్ట్ ఇన్ న్యూయార్క్’ మూవీ 1992లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ట్రంప్ ఏడు సెకండ్ల పాటు కనిపించారు. 1992 నాటికి ట్రంప్ రాజకీయాల్లోకి రాలేదు. కేవలం తన వ్యాపారాలను మాత్రమే చూసుకునే వారు. అయితే ఈ సినిమాలో ట్రంప్ ను తీసుకోవడం శాపంగా మారిందని తాజగా దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అప్పుడు ట్రంప్ ను తీసుకోకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇది ఒక సమస్యగా తనకు మారిందన్నారు. ట్రంప్ కనిపించిన సీన్లను తొలగించాలని భావించినా అది సాధ్యపడలేదని తెలిపారు. అయితే గతంలో కూడా ఈ దర్శకుడు ట్రంప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా షూటింగ్ సమయంలో న్యూయార్క్ లోని ప్లాజా హోటల్ లో షూటింగ్ కోసం అనుమతి తీసుకున్నామని, అయితే హోటల్ యజమాని అయిన ట్రంప్ తనను సినిమాలో చూపించాలని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. కానీ సినిమా దర్శకుడే నటించాలని తన వెంటపడ్డారని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions