Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సునీతా విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ

సునీతా విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ

PM Modi writes letter to Sunita Williams ahead of her return | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి తిరిగివస్తున్నారు.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సునీతాకు లేఖను రాశారు. మార్చి 1న రాసిన లేఖను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా దారా షేర్ చేశారు. వేల మైళ్ళ దూరంలో ఉన్నా సునీతా భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.

వ్యోమగామి మైక్ మాసిమినో ( astronaut Mike Massimino ) ద్వారా ప్రధాని మోదీ సునీత విలియమ్స్ కు లేఖను పంపారు. అమెరికా పర్యటనలో భాగంగా వ్యోమగామి మైక్ మాసిమినో ను కలిసిన ప్రధాని 140 కోట్ల భారత ప్రజల తరఫున తాను రాసిన లేఖను సునీతా విలియమ్స్ కు చేరవేయాలని కోరారు.

సునీత సురక్షితంగా పుడమికి చేరుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. అలాగే ఆమె సాధించిన విజయాల పట్ల భారత్ గర్వంగా ఉందన్నారు. తిరిగి వచ్చిన తర్వాత సునీతాను భారత్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు, తన కుమార్తెకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ వేచి చేస్తుందని లేఖలో ప్రధాని తెలిపారు. మోదీ లేఖపై సునీత విలియమ్స్ సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions