Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > హిందీ గో బ్యాక్..పవన్ గత వ్యాఖ్యల్ని గుర్తుచేసిన స్టాలిన్ సోదరి

హిందీ గో బ్యాక్..పవన్ గత వ్యాఖ్యల్ని గుర్తుచేసిన స్టాలిన్ సోదరి

Kanimozhi Counter To Pawan Kalyan | జనసేన ( Janasena ) 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో శుక్రవారం జరిగిన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందీ ప్రాంతాల నుండి డబ్బులు కావాలి, కానీ వారి భాషను మాత్రం అనుమతించారా అంటూ తమిళనాడు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంకే ( DMK ) ఎంపీ, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి స్పందించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గతంలో ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ను షేర్ చేశారు. దక్షిణాదిన హిందీని రుద్ద వద్దని అంటారు, అన్నీ దేశ భాషలే కదా, ఒకవేళ హిందీని వ్యతిరేకిస్తే తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకూడదని పవన్ చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ క్రమంలో భాషా అడ్డంకులను దాటి సినిమాలు చూడటానికి టెక్నాలజీ అనుమతిస్తుందని కనిమొళి పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ 23న హిందీ గో బ్యాక్ అంటూ పవన్ కళ్యాణ్ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఉత్తరాది నాయకులు దేశ సాంస్కృతిక భిన్నత్వాన్ని అర్ధం చేసుకుని, గౌరవించాలని గతంలో పవన్ పేర్కొన్నారు. ఇదే ఫోటోను కనిమొళి షేర్ చేశారు. అప్పుడు హిందీ గో బ్యాక్ ( Hindi Go Back ) అని, ఇప్పుడు మాత్రం పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions