Prashanth Kishore And Vijay Share Stage | తమిళనాడు స్టార్ నటుడు దళపతి విజయ్ ( Thalapathy Vijay ) తమిళగ వెట్రి కళగం ( TVK ) పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore ) టీవీకే పార్టీ స్ట్రాటజిస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు తాజగా టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవంలో విజయ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ వేదికను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ టీవీకే కేవలం రాజకీయ పార్టీ కాదని ఇది ఒక ఉద్యమమన్నారు. ఐపీఎల్ లో ఎంఎస్ ధోని ( Ms Dhoni ) ఎలాగైతే చెన్నై ను గెలిపిస్తారో అలానే తాను విజయ్ ను గెలిపిస్తాను అంటూ ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తమిళనాడులో ధోని ఎంత పాపులరో తెల్సిందే. కానీ విజయ్ ని ఎన్నికల్లో గెలిపించిన తర్వాత తాను తమిళనాడులో ధోని కంటే పాపులర్ అవుతానని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఎన్నికల వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.










