Saturday 1st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చింతమనేనికి సీఎం చంద్రబాబు అక్షింతలు

చింతమనేనికి సీఎం చంద్రబాబు అక్షింతలు

Chintamaneni Prabhakar Latest News | దెందులూరు ( Denduluru ) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే.

ఇటీవల ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన చింతమనేని తన కారుకు అడ్డుగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉద్దేశ్యపూర్వకంగా కారును అడ్డు పెట్టించారని చెబుతూ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చింతమనేని దుర్భశలాడిన వీడియో వైరల్ గా మారింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu )ను చింతమనేని శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కలిశారు. అబ్బయ్యచౌదరీనే ఉద్దేశ్యపూర్వకంగా కారు అడ్డు పెట్టించారని సీఎంకు వివరించారు.

అయితే చింతమనేని పై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. దుర్భాశలాడిన వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో మనం అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తించుకోవాలని, సహనం ప్రదర్శించాలని, ఇలా వ్యవహారిస్తే ఎలా అంటూ ముఖ్యమంత్రి అక్షింతలు వేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions