Monday 30th March 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ ఏడాది పాలన..ప్రజలు నవ్వుకుంటున్నారు

కాంగ్రెస్ ఏడాది పాలన..ప్రజలు నవ్వుకుంటున్నారు

Telangana BJP Charge Sheet On Congress Failures | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.

కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ గ్యారంటీల గారడి..ఆరు అబద్ధాలు..66 మోసాలు’ పేరుతో చార్జిషీట్ ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..100 రోజుల్లోనే నెరవేస్తామన్న హామీలు ఏడాది అయిన పూర్తికాలేదని ధ్వజమెత్తారు.

ప్రజల సమస్యలను పరిష్కరించని కాంగ్రెస్, విజయోత్సవాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు రేవంత్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘మహాలక్ష్మి స్కీమ్ కాదు మహా ధోకా 6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మహిళలకు జరిగింది అన్యాయమే రైతు భరోసా కాదు రైతులకు అరిగోస ఆనాటి నుంచి నేటి వరకు అదే గోస గృహజ్యోతి.. ఆరు పదుల చీకట్లకు సాక్ష్యం ఇప్పటికీ అబద్ధాలతో చేస్తున్నరు నిర్లక్ష్యం ఇప్పటికీ గూడు కరువైన పేదలు ఉన్నారంటే ఆరు పదుల కాంగ్రెస్ పాలన శాపమే అది ఇండ్లు కాదు… అవి పేదలకు కడగండ్లు’ అని మండిపడ్డారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’!
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions