Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కేంద్రమంత్రి రామ్మోహన్ ను కలిసిన సీఎం రేవంత్

కేంద్రమంత్రి రామ్మోహన్ ను కలిసిన సీఎం రేవంత్

Cm Revanth Meets Union Minister Rammohan Naidu | కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ బృందం కేంద్రమంత్రిని కలిసింది. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి చర్చించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి విమానాశ్రయానికి కావలసిన భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరితగతిన వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి- రామగుండం, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలు ఏర్పాటుపై కూడా చర్చించారు.

ప్రధాని నాయకత్వంలో సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పౌర విమానయాన శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions