Kavitha Kalvakuntla On Maganuru School Incident | చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోందని విమర్శించారు బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత.
ఈ మెరుకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మాగునూరు జెడ్పీ హైస్కూల్ ( Maganuru ZP High School ) లో వరుస ఫుడ్ పాయిజన్ ( Food Poison ) ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని నిలదీశారు.
ప్రజా పాలను అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలను నిర్బందిస్తూ, తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయన్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి మరియు కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటులను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వం అని కవిత స్పష్టం చేశారు.