Friday 25th July 2025
12:07:03 PM
Home > తాజా > రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి

రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి

Cm Revanth On Paddy Procurement | రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సన్న రకాలపై ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 విషయంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు.

గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా రైతుల్లో భరోసా కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించగా, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందన్నారు.

సన్నరకాలకు తెలంగాణలో బోనస్ అందిస్తుండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా ధాన్యం తరలిస్తున్నారని, అలాంటి వాటి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్‌చార్జి మంత్రులు, ఇన్‌చార్జి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షిస్తూ రోజూవారి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

You may also like
ఇందిరా గాంధీ రికార్డు బ్రేక్ చేసిన నరేంద్రమోదీ
WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి
‘అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ ఉద్యమించారు’
‘చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions