Monday 27th October 2025
12:07:03 PM
Home > తాజా > రిలేషన్షిప్ స్టేటస్ పై కీర్తి సురేష్ పోస్ట్

రిలేషన్షిప్ స్టేటస్ పై కీర్తి సురేష్ పోస్ట్

Keerthy Suresh Confirms Relationship With Antony | నటి కీర్తి సురేష్ ( Keerthy Suresh ) పెళ్లిపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. స్నేహితుడు ఆంటోనీ ( Antony )ని కీర్తి వివాహమాడనుందని ప్రచారం జరిగింది.

తాజగా ఈ వార్తలను కీర్తి సురేష్ నిజం చేశారు. చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకొనున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆంటోనీతో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టా ( Instagram )లో షేర్ చేశారు.

దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో కలసి దిగిన ఫోటోను షేర్ చేసిన కీర్తి, 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇక జీవితాంతం కొనసాగనుందని చెప్పారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రెటీలు ఆమెకు కంగ్రాట్స్ ( Congrats ) చెబుతున్నారు.

కాలేజి చదివే రోజుల్లో కీర్తి, ఆంటోనీల మధ్య స్నేహం ఏర్పడి, ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కేరళకు చెందిన ఆంటోనీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు విదేశాల్లో ఉద్యోగం చేశారు, అయితే ఇప్పుడు కేరళలో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయి. ఇకపోతే త్వరలోనే వీరి పెళ్లి ఎప్పుడనేది తెలిసే అవకాశం ఉంది.

You may also like
మోదీని హత్య చేసేందుకు యూఎస్ కుట్ర..కాపాడిన పుతిన్?
తెలగాణ తేజం ‘కొమురం భీం’ను కీర్తించిన ప్రధాని
‘ఆదాని కోసం మోదీ ఏమైనా చేస్తారు’
ఆదాని కోసం ఎల్ఐసీ డబ్బులు..సంచలన ఆరోపణలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions