Wednesday 16th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తండ్రిని తలచుకుని నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

తండ్రిని తలచుకుని నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

Nara Rohit Emotional Post On His Father | మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ( Nara Ramamurthy Naidu ) అనారోగ్య కారణాలతో శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే.

ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ ( Hyderabad ) నుండి స్వస్థలం నారావారిపల్లెకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో తండ్రిని తలచుకుని తనయుడు నారా రోహిత్ ఎమోషనల్ ( Emotional ) పోస్ట్ చేశారు.’ మీరొక ఫైటర్ ( Fighter ) నాన్నా, మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు ‘ అని గుర్తుచేసుకున్నారు.

‘ నాన్నా మీరొక ఫైటర్, నాకు ప్రేమించడం, జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరే. న్యాయం కోసం పోరాటం ఎలా చేయాలో నేర్పించారు. మీ జీవితం సాఫీగా సాగకున్న, మమ్మల్ని మాత్రం అత్యంత జాగ్రత్తగా చూసుకున్నారు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్నా మీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లే.. బై నాన్న ( Bye Nanna ) ‘ అంటూ నారా రోహిత్ ఎమోషనల్ అయ్యారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions