Sunday 30th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బోరుగడ్డకు ఖాకీల రాచమర్యాదలు..ఈసారి ఏకంగా స్టేషన్ లోనే !

బోరుగడ్డకు ఖాకీల రాచమర్యాదలు..ఈసారి ఏకంగా స్టేషన్ లోనే !

Borugadda Anil Latest | గతంలో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ ( Borugadda Anil ) కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు.

విచారణ కోసం అరండల్ పేట ( Arundalpet ) పీఎస్ కు బోరుగడ్డను తరలించిన ఖాకీలు, స్టేషన్ లో ఆయనకు ఇంటికి తీసిపోని విదంగా మర్యాదలు చేశారు. పడుకోవడానికి ఓ బల్లా, పరుపు, దిండు, బ్లాంకెట్ ( Blanket ) ఇచ్చారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్ లో నమోదైన రెండు కేసుల్లో ప్రస్తుతం బోరుగడ్డను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా అతడు కూర్చోవాడానికి ఏకంగా రైటర్ సీటునే ఇవ్వడం, దగ్గరుండి భోజనం వడ్డించారు.

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం మంగళగిరి న్యాయస్థానంలో బోరుగడ్డను హాజరుపరిచేందుకు గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలు నుండి బోరుగడ్డను తీసుకువచ్చారు. తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఓ రెస్టారెంట్ లో బిర్యానీ పెట్టించేందుకు ఖాకీలు రెడీ అవ్వడం పెను దుమారాన్ని రేపింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions