Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > కిన్నెర మొగిలయ్యకు 600 గజాల స్థలం ఎక్కడంటే!

కిన్నెర మొగిలయ్యకు 600 గజాల స్థలం ఎక్కడంటే!

kinnera mogilaiah

CM Allots Plot To Mogilaiah | ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్య (Mogilaiah) కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంటి స్థలం మంజూరు చేశారు. హయత్ నగర్ లో 600 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను జూబ్లీహిల్స్ లోని తన నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మొగిలయ్యకు అందజేశారు. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడం పై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.

మొగిలయ్యకు పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ లో అవకాశం రావడంతో ఫేమస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి రూపాయలు ఆర్థికసాయం అందజేసింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స్థలం కేటాయించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions