Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన జేసీబీ డ్రైవర్..సన్మానించిన ఓవైసీ

వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన జేసీబీ డ్రైవర్..సన్మానించిన ఓవైసీ

Asaduddin Owaisi Honors Khammam JCB Driver | ఖమ్మం ( Khammam )లోని ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు ( Munneru )వాగు వరద ఉదృతిలో చిక్కుకున్న తొమ్మిది మందిని ఓ జేసీబీ డ్రైవర్ ( JCB Driver ) తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు.

భీకర వరదను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లి తన జేసీబీతో ఇతరుల ప్రాణాలను కాపాడిన సుభాన్ ఖాన్ ( Subhan Khan ) రియల్ హీరోగా నిలిచాడు. హర్యానా ( Haryana ) రాష్ట్రానికి చెందిన సుభాన్ ఖాన్ వికలాంగుడు.

అయినప్పటికీ ఎంతో ధైర్య సాహసం ప్రదర్శించిన జేసీబీ డ్రైవర్ ను అందరూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) సుభాన్ ఖాన్ ను ఘనంగా సన్మానించారు.

హైదరాబాద్ దారుసలాం లో జేసీబీ డ్రైవర్ ను సన్మానించి, ధైర్య సాహసాలను కొనియాడారు. ఈ సందర్భంగా, పార్టీ తరఫున రూ.51 వేలను అందించారు.

అలాగే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి సుభాన్ ఖాన్ కు డబల్ బెడ్రూం ఇల్లును కేటాయించాలని ఓవైసీ కోరారు.

You may also like
ఒవైసీ బెటర్..బీజేపీ ఎంపీలకు మోదీ చురకలు
ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధం..ఒవైసీ సంచలన ప్రకటన
బీహార్ ఎన్నికలు..ఎంఐఎం తరఫున రాజపుత్ అభ్యర్థి
‘IND vs PAK మ్యాచ్ చూడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions