Monday 22nd June 2026
12:07:03 PM
Home > తాజా > భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!

భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!

husband second marriage

Wife Accepts Second Marriage to Husband | మహబూబా బాద్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన భార్తకు దగ్గరుండి మరీ రెండో పెళ్లి (Second Marriage) చేయించింది. అయితే దీని వెనక ఓ కారణముంది.

మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాకు చెందిన సురేష్, సరితలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మరోవైపు సురేశ్ మేనమామకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో చిన్న కూతురు సంధ్య ఓ మానసిక దివ్యాంగురాలు.

సంధ్యకు చిన్నప్పటి నుంచి సురేష్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకుంటే సురేష్‌నే చేసుకుంటానని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు చివరకు ఈ విషయాన్ని సురేష్ దంపతుల వద్ద ప్రస్తావించారు.

అయితే సంధ్యను వివాహం చేసుకునేందుకు సురేష్ భార్య సరిత అంగీకరించింది. అంతే కాకుండా తానే పెళ్లి పెద్దగా వ్యవహరించి, దగ్గరుండి వివాహం జరిపించింది. సరిత తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ఇక నుంచి సంధ్య బాధ్యత తామే చూసుకుంటామని సరిత తెలిపింది.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions