Wednesday 16th September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > చెడ్డీ గ్యాంగ్ తరహాలో రెచ్చిపోతున్న చుడిదార్ గ్యాంగ్!

చెడ్డీ గ్యాంగ్ తరహాలో రెచ్చిపోతున్న చుడిదార్ గ్యాంగ్!

chudidar gang

Chudidar Gang | కొంత కాలం క్రితం వరకు హైదరాబాద్ (Hyderabad) మరియు శివారు ప్రాంతాల్లో చెడ్డీలు ధరించి కొందరు దుండగులు చోరీలకు పాల్పడిన విషయం తెల్సిందే.

చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) గురుంచి మరువక ముందే కొత్తగా చుడిదార్ గ్యాంగ్ (Chudidar Gang) చోరీలకు యత్నిచడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్ ఎస్సార్ నగర్ పీఎస్ (SR Nagar PS) పరిధిలోని చెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్స్ లోని ఓ ప్లాట్ లో చుడిదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఇంటి యజమాని వెంకటేశ్వర్ రావు, కుటుంబ సమేతంగా ఒంగోలు వెళ్లారు.

అయితే ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గ్రహించిన ఈ దుండగులు చుడిదార్ ధరించి శనివారం రాత్రి ప్లాట్ లోకి చొరబడి దొంగతనం చేశారు. నాలుగు తులాల బంగారం, రూ. లక్ష నగదు, ఒక ల్యాప్ టాప్ ను దొంగిలించారు.

మరునాడు విషయాన్ని గ్రహించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దింతో సీసీటీవీ ఫుటేజ్ చూడగా చుడిదార్ గ్యాంగ్ వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions