Wednesday 17th June 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి!

కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి!

Chiranjeevi

Chiranjeevi Visits KCR | హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానన్నారు.

సినిమాలు ఎలా ఆడుతున్నాయి.. ఇండస్ట్రీ ఎలా ఉందని కేసీఆర్ ఈ సమయంలో కూడా అడగటం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలిపారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేసీఆర్‌ను పరామర్శించారు.  

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions