Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ సముదాయం.. డిసెంబర్ 17 న ప్రారంభం!

ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ సముదాయం.. డిసెంబర్ 17 న ప్రారంభం!

SDB
  • డిసెంబర్ 17న సూరత్ డైమండ్ బోర్స్ ను లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని
  • ప్రపంచవ్యాప్తంగా 70 వేల మందికి ఆహ్వానం

World’s Largest Office Building | ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం మనదేశంలో ప్రారంభత్సవానికి సిద్ధమైంది.

గుజరాత్ లోని సూరత్ డైమండ్ బోర్స్ (Surat Dimond Bourse) భవన సముదాయాన్ని డిసెంబర్ 17న మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

దాదాపు రూ. 3,500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది ఉంది. ఈ భవన సముదాయం  దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ కార్యాలయాలను నిర్మించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ ఏడాది ఆగస్టులో, డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో భాగమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 35.54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగాస్ట్రక్చర్‌లో తొమ్మిది గ్రౌండ్ టవర్‌లతో పాటు 15 అంతస్తులు ఉన్నాయి.

300 చదరపు అడుగుల నుండి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. తొమ్మిది దీర్ఘచతురస్రాకార టవర్‌లు అనుసంధానించబడి ఉన్నాయి.

ఆఫీసులతో పాటు, డైమండ్ బోర్స్ క్యాంపస్‌లో సేఫ్ డిపాజిట్ వాల్ట్‌ లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్‌లు, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్‌లు, ట్రైనింగ్ సెంటర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియాలు, రెస్టారెంట్లు మరియు సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.  

గత కొన్ని వారాలుగా అనేక వజ్రాల వ్యాపార సంస్థలు ఇప్పటికే SDBలోని తమ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. కట్టర్లు, పాలిషర్లు మరియు వ్యాపారులను కలుపుకొని 65,000 మంది వజ్రాల నిపుణులకు అనుకూలమైన హబ్‌గా ఈ భవనం ఉపయోగపడనుంది.

ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుండి ప్లాటినం ర్యాంకింగ్ ఉంది. 2015లో ఫిబ్రవరి భవనం నిర్మాణం ప్రారంభమైంది. డిసెంబర్ 17న ప్రారంభోత్సవానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి 70,000 మందికి ఆహ్వానాలు పంపారు.

You may also like
ఆ క్రెడిట్ మీరే తీసుకోండి.. ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions