Thursday 21st November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > “మునుగోడుకు సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు”

“మునుగోడుకు సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు”

Harish Rao
  • చౌటుప్పట్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి వంద పడకల ఆసుపత్రికి మంగళవారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా  మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.  

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆసుపత్రి నిర్మిస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారి మీద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అత్యవసర సమయాల్లో హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వైద్యం పొందటం వీలవుతుంది.

గోల్డెన్ అవర్ లో చికిత్స అందించి, తద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యం గురించి రూ. 1300 కోట్ల పనులు చేసుకుంటున్నాం. ఇందులో చాలా వరకు పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయి.

నల్లగొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉంది. ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్‌ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారు.

నాంపల్లి, మునుగోడు, చండూరు, నారాయణ్ పుర్  పి హెచ్ సి 24 గంటల పాటు ఉండేలా చేస్తాం.

తెలంగాణ వచ్చాక సీఎం గారు నల్గొండకు ఎంతో చేశారు. రాష్ట్రం వచ్చాక నాలుగు ఇస్తే, రెండు మెడికల్ కాలేజీలు నల్గొండ, సూర్యాపేట ఇచ్చారు.

ఎయిమ్స్ అతీగతీ లేదు. ఓపీ తప్ప, ఐపీ లేదు. 2018 ప్రారంభంఅయితే మొన్న వచ్చి మోడీ భూమి పూజ చేశారు.

ఎయిమ్స్ పై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు.

ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. నాడు 3 ఉంటే, నేడు 102 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం.

మారుమూల ప్రాంతాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది.

పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో 500 వరకు బస్తీ దవాఖానాల సంఖ్య పెరుగుతుంది.

ఊరూరా పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం వేద్యం పై ప్రజలు కు నమ్మకం పెరిగింది.

ఏప్రిల్ చివరి లోపు రాష్ట్రం అంతటా న్యూట్రిష కిట్లు అందిస్తాం. జిల్లాల్లో కీమో థెరపీ సేవలు ప్రారంభిస్తున్నాము. సూర్యాపేట లో కూడా ఏర్పాటు చేస్తాం.

తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంపై ఆలోచన ఉన్న సీఎం కేసీఆర్ గారు.. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా చూస్తూ కూర్చోలేదు. చేతల్లో చూపెట్టాడు.

రాష్ట్ర సొంత నిధులతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తనని ప్రకటించి, అమలు చేస్తున్నారు.

తెలంగాణ వస్తే ఏం వచ్చిందనే వారికి, మీ కండ్ల ముందే జరుగుతున్న అభివృద్ధే సమాధానం.

మారుమూల ప్రాంతాలు సైతం కొత్త జిల్లాలు కాగా, ఆ కొత్త జిల్లాలకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వచ్చాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్ వంటి మారుమూల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతాయని కలలో అయినా అనుకున్నామా..

కలలో కూడా అనుకోని దాన్ని సీఎం కేసీఆర్ ఇలలో చేసి చూపెట్టారు. తెలంగాణ రాక ముందు సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నా, వైద్య విద్య అన్నా.. తెలంగాణ ప్రజలకు అందని ద్రాక్ష.

వైద్యం కోసం జిల్లాలు దాటి హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి. ఇక వైద్య విద్య కోసం దేశాలు దాటాల్సిన దుస్థితి.

ఉమ్మడి పాలనలో సరైన వైద్యం అందక ప్రజలు అనుభవించిన నరకయాతనను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో రాష్ట్ర సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు.

గతేడాది ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా, 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోగా, ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం.

నాడు వైద్యానికి, వైద్య విద్యకు కరువు ప్రాంతంగా ఉన్న రాష్ట్రం నేడు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి, నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

దేశానికే మెడికల్ హబ్ గా నేడు తెలంగాణ ఆవిర్భవించింది. 2014కు ముందు తెలంగాణలో 20  మెడికల్ కాలేజీలు ఉంటే, 2022 నాటికి 46కు చేరుకున్నాయి. ఈ ఏడాది 9 కలుపుకుంటే మొత్తం 55కు సంఖ్య చేరుతుంది.

65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏండ్లలో 35 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగింది. మెడికల్ సీట్లు నాడు 2950 ఉంటే, ఇప్పుడు 7090కి పెరిగింది. ఈ ఏడాది 9 కాలేజీల్లో సీట్లు కలుపుకుంటే 7990 అవుతాయి.” అని హరీశ్ రావు ప్రసంగించారు.

You may also like
harish rao
ఇది 8 పర్సెంట్ గవర్నమెంట్.. హరీశ్ రావు విమర్శలు!
vemula veeresham
టేబుల్ మీద వెపన్ పెట్టి బెదిరించారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే!
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!
telangana high court
‘బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయండి’.. హైకోర్టు కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions