Thursday 15th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘సీఎం మోసం..బీసీ యువకుడి ప్రాణం బలైంది’

‘సీఎం మోసం..బీసీ యువకుడి ప్రాణం బలైంది’

42% BC reservation issue | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్‌ ఆత్మాహుతి చేసుకున్నారని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే అని అన్నారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కులగణనను మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టిందన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

You may also like
మూడు రోజులుగా హనుమంతుడి చుట్టూ శునకం ప్రదక్షిణలు
ఐదేళ్ల తర్వాత సింహాసనంపై కోహ్లీ
కాసుల వర్షం కురిపిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’
’17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి హరీష్’..కేసీఆర్ పార్టీ రియాక్షన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions