Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘తల్లిదండ్రులను విస్మరిస్తే..జీతంలో కోత’

‘తల్లిదండ్రులను విస్మరిస్తే..జీతంలో కోత’

CM Revanth Reddy proposes law to deduct salary from employees neglecting parents | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీతం నుంచి 10 శాతం కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేట్టుగా చట్టం చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు శనివారం శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి నియామక పత్రాల అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..గ్రూప్-2 లో ఎంపికైన వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ అధికారులుగా ఉద్యోగంలో చేరడానికి తమ రక్తాన్ని చమటగా మార్చి భూజాన మోసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని సూచించారు.

కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం బాధ్యత అని గుర్తుచేశారు. అధికారులు తమ వద్దకు వచ్చే ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని సేవలు అందించాలని పేర్కొన్నారు. నిస్సహాయులకు అండగా సహాయం అందించడమే బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీతం నుంచి 10 శాతం కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేట్టుగా చట్టం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions