Thursday 24th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు

ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు

YS Jagan News Latest | ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ అభిమానులు తాజగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 21న వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారన్న కారణంతో ఏకంగా 11 మంది వైఎస్సార్‌సీపీ అభిమానులపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్‌కు పంపారని జగన్ కు వివరించారు. తమపై ఖమ్మంకు చెందిన ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయంతోనే పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి నాన్‌బెయిలబుల్ సెక్షన్‌లతో జైలుకు పంపారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జగన్ స్పందిస్తూ తెలంగాణలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్‌ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ క్యాడర్‌కు అవసరమైన న్యాయసహాయాన్ని అందించేందుకు పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions