Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > ఎంత దారుణం..ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి తరహా ఘటన

ఎంత దారుణం..ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి తరహా ఘటన

Woman Attacks Doctor’s Wife With HIV Injection | ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో దారుణ ఘటన వెలుగుచూసింది. తన మాజీ ప్రియుడ్ని పెళ్లి చేసుకుందనే ద్వేషంతో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. మాజీ ప్రియుడి భార్యకు ఇంజక్షన్ సహాయంతో హెచ్ఐవీ వైరస్ ను ఎక్కించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నూలుకు చెందిన ఓ వైద్యుడు ఆదోనికి చెందిన వసుంధర అనే నర్సు కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. అనంతరం సదరు డాక్టర్ మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె కర్నూలు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 9న అసిస్టెంట్ ప్రొఫెసర్ విధులు ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో నలువురు వ్యక్తులు స్కూటీని ఢీ కొట్టడంతో వైద్యుడి భార్య కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించిన వసుంధర అత్యంత భయంకరమైన హెచ్ఐవీ వైరస్ ను ఎక్కించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే తన మాజీ ప్రియుడిని పెళ్లి చేసుకుందని ద్వేషంతో వారిని విడదీయాలనే కుట్రలో భాగంగానే నిందితురాలు ఇలా చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions