Saturday 27th July 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది: కిషన్ రెడ్డి

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది: కిషన్ రెడ్డి

union minister kishan reddy
  • రాష్ట్రానికి ఆ పార్టీ అవసరం లేదు
  • అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్
  • కాంగ్రెస్ కు ఇప్పుడున్న 40 సీట్లు కూడా రావు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఓటు వేయడం వృథా
  • దేశం గాడీలో ఉండాలంటే మోదీ నాయకత్వాన్ని ఆశీద్వారించాలి
  • తుప్రాన్ రోడ్ షో లో కేంద్రమంత్రి

కపోతం, హైదరాబాద్: తెలంగాణలో బీఆరెస్ పార్టీ కథ ముగిసిందనీ, రాష్ట్రానికి ఆ పార్టీ అవసరం ఇక లేదని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం ఆయన తుప్రాన్ రోడ్ షో లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ మెుదటి వారంలోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నామని చెప్పారు. దేశానికి మోదీ ఎంతో సేవ చేశారనీ, టాయిలెట్ నుండి చంద్రయాన్ వరకు నరేంద్ర మోడీ చేయని అభివృద్ది కార్యక్రమం లేదన్నారు. “పేదలకు ఉచితంగా ఇళ్లు, గ్యాస్, బియ్యం అందించారు. ఆయిష్మాన్ భారత్ పేదలకు రూ.5లక్షల ఆరోగ్య భీమా అందించారు. ఏడాదికి రైతులకు మోడీ రూ. 6 వేల ఇస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయితీలలో అభివృద్దికి కేంద్రం నిధులు ఇస్తుంది” అని తెలిపారు.

Read Also: గ్రేటర్ లో బీఆరెస్ కీలక నేత రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ లో చేరిక!

భారత్ ను శాంతియుత దేశంగా మార్చారు

గత యూపీఏ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ తో సహా దేశంలో అనేక చోట్ల ఉగ్రవాద దాడులు జరిగేవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశాన్ని ప్రధాని మోదీ శాంతియుత దేశంగా మార్చారని కొనియాడారు. పాక్ ఉగ్రవాదుల ఆటకట్టించారని తెలిపారు. “పదేళ్లుగా దేశం శాంతియుతంగా ఉంది. దేశంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు. దానికి కారణం మోదీ. దేశం మెుత్తం మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు” అని పేర్కొన్నారు.

17 సీట్లను గెలిచేందుకు ప్రయత్నిస్తాం..

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని మొత్తం 17 సీట్లను గెలిచే ప్రయత్నం చేస్తు్న్నామన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వం కోరుకుంటున్నారని అభిలషించారు.

“రాష్ట్రంలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్. ఆ పార్టీ నేతల అవీనితి పరులు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 40 సీట్లు కూడా రావు. కాంగ్రెస్‌ చూక్కాని లేని నావలాంటిది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేయడం వెస్ట్. దేశం గాడీలో ఉండాలంటే మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే మోడీ నాయకత్వాన్ని ఆశీద్వారించాలి. దేశం మరింత అభివృద్ది చెందాలంటే మోదీ మళ్లీ రావాలి. కచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుండి బీజేపీని గెలిపించాలి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి.

You may also like
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!
raghunandan rao
కేసీఆర్ పై ఈడీ కేసు నమోదయ్యింది: ఎంపీ రఘునందన్
BJP Raghunandan rao
బండి సంజయ్ గెలిస్తే మోదీ కేబినెట్ లో మంత్రి కావడం తథ్యం!
bjp telangana
బీజేపీ రెండో జాబితా విడుదల..కీలక నేతలకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions