Sunday 26th January 2025
12:07:03 PM
Home > తాజా > గ్రేటర్ లో బీఆరెస్ కు వరుస షాక్ లు!

గ్రేటర్ లో బీఆరెస్ కు వరుస షాక్ లు!

teegala resigns brs
  • పార్టీకి మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణా రెడ్డి రాజీనామా
  • కాంగ్రెస్ లోకి రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి
  • ఈ నెల 27న ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక?
  • ఆదివారం హస్తం పార్టీలో చేరిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత

కపోతం, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో బీఆరెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆదివారం బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణా రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆరెస్ అధినేత కేసీఆర్ కు పంపారు. తీగలతోపాటు ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ తీగల అనితహరినాథ్‌రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నారు. ఫిబ్రవరి 27న చేవెళ్లలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ వేదికగా ప్రియాంక గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Read Also: రేవంత్ రెడ్డే సీఎం అని ముందే చెప్పి ఉంటే 30 సీట్లు కూడా రాకపోతుండే!

వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే తీగల క్రిష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వెలువడ్డాయి. ఆయన స్థానంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీగల కాంగ్రెస్ చేరిక దాదాపుగా ఖాయం అయింది. కానీ అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కితగ్గారు. అయితే రెండ్రోజుల కిందట ముఖ్యమంత్రిని తీగల కుటంబం కలవడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. కాగా ఈ మధ్యనే వికారాబాద్‌ జిల్లా ప రిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి-మహేందర్‌రెడ్డి దంపతులు, వారి కుమారుడు సీఎం సమ క్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

కాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్..!

మరోవైపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా బీఆరెస్ పార్టీని వీడారు. ఆమె భర్త, బీఆరెస్ కీలక నేత మోతె శోభన్ రెడ్డితో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో భార్యాభర్తలు ఇరువురూ హస్తం పార్టీ కండువా కప్పుకొన్నారు. మొన్న వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, నిన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రేపు తీగల క్రిష్ణా రెడ్డి ఇలా కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో గ్రేటర్ లో బీఆరెస్ కు వరుస షాక్ లు తగిలినట్లవుతోంది.

You may also like
kcr sister cheeti sakalamma
కేసీఆర్ సోదరి మృతి.. నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత!
‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’
‘వెంటనే బాత్రూంలు నిర్మించండి’
సింగపూర్ లో సీఎం రేవంత్..ఆ దేశ మంత్రితో భేటీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions