Friday 18th September 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ తో సినీ పెద్దల భేటి.. ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే?

సీఎం రేవంత్ తో సినీ పెద్దల భేటి.. ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే?

tollywood meets cm revanth


Tollywood Meets CM Revanth | తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) తో టాలీవుడ్‌ (Tollywood) సినీ ప్రముఖులు గురువారం భేటీ అయ్యారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎంని కలిశారు.

సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) ఘటన, అల్లు అర్జున్‌ అరెస్టు (Allu Arjun Arrest) నేపథ్యంలో సీఎంతో సినీ పరిశ్రమ పెద్దల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది.

డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రచార కార్యక్రమాలకు ఇండస్ట్రీ సహకరించాలి.
డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాల్లో స్వయంగా హీరోలే పాల్గొనాలి.
ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి.
సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ విధించి దాన్ని, ప్రభుత్వం ఇంటిగ్రేటెట్‌ స్కూల్స్‌ నిర్మాణానికి వినియోగిస్తుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి సినీ తారలు సహకరించాలి
ఇక నుంచి బెనిఫిట్‌ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చు.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions