Monday 15th June 2026
12:07:03 PM
Home > క్రైమ్ > లక్షన్నర విలువ చేసే టమాటల చోరీ…కర్ణాటకలో వింత….!

లక్షన్నర విలువ చేసే టమాటల చోరీ…కర్ణాటకలో వింత….!

దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఇంకా పెరుగుతున్నాయి.
సామాన్యులు టమాట అంటెనే దూరం వెళ్తున్నారు.ఇప్పుడు కేవలం డబ్బుఉన్నవారు మాత్రమే టమాటను కొనుగోలు చేస్తున్నారు.
ఒక కేజీ టమాట ధర రూ.100-రూ.160 వరకు ఉంది. టమాట పంటకు తెగులు రావడం, వర్షాల వల్ల పంటకు తీవ్ర నష్టం జరగడం వలన డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఇదే అదునుగా చూసుకొని కొందరు పంట పొలాల్లో టమాటలు చోరీ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.

ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రం హస్సన్ జిల్లాలో జరిగింది.
కర్ణాటక రాష్ట్రం హస్సాన్ జిల్లా గోని సోమనహల్లి గ్రామంలో బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధరణి అనే రైతు పొలంలోకి చొరబడి సుమారు లక్షన్నర రూపాయిల విలువ చేసే టమాటలను దొంగతనం చేశారు.

ఉదయం పొలంలోకి వెళ్లిన రైతు టమాటాలు దొంగతనానికి గురువ్వడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే హాలేబీడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. దుండగులని వెతుకుతున్నాం అని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions