Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో మోసపోకండి.. టీజీఎస్‌ఆర్‌టీసీ!

ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో మోసపోకండి.. టీజీఎస్‌ఆర్‌టీసీ!

TGSRTC MD Y Nagi Reddy Job Recruitment Alert | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఉద్యోగ నియామకాల కోసం ఇటీవలే నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో.. వేలాది మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే, ఇదే అదనుగా నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసగాళ్లు, దళారుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై. నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో నిరుద్యోగులను హెచ్చరించారు.

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.

కార్పొరేషన్ పరిధిలోని అన్ని నియామకాలు కేవలం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Police Recruitment Board) ఆధ్వర్యంలో, కేటాయించిన అధికారిక నియామక నియమ నిబంధనల ప్రకారమే జరుగుతాయి.

ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే మధ్యవర్తులను, బ్రోకర్లను లేదా మరే ఇతర వ్యక్తులను అస్సలు నమ్మవద్దని ఆయన నిరుద్యోగ అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.

షార్ట్‌కట్ నమ్మొద్దు..
ఉద్యోగార్థులకు దిశా నిర్దేశం చేస్తూ ఎండీ నాగిరెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. “మీకున్న ప్రతిభే మీ పెట్టుబడి, మీ కష్టపడే తత్వమే ఉద్యోగానికి రాజమార్గం. మీ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఎలాంటి తప్పుడు షార్ట్‌కట్ మార్గాలను (Shortcuts) ఎంచుకోకండి.

కష్టపడి, చిత్తశుద్ధితో ప్రిపేర్ అవ్వండి.. మీ మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు సాధించండి” అని ఆయన పిలుపునిచ్చారు.

నియామకాల పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించినా, లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినా.. అలాంటి వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎండీ నాగిరెడ్డి గట్టిగా హెచ్చరించారు.

ఉద్యోగార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగ సమాచారం కోసం కేవలం అధికారిక నోటిఫికేషన్లను, అధికారిక ఛానళ్లను మాత్రమే ఆశ్రయించాలని టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం కోరింది.

You may also like
cm revanth reddy
“సీఎం రేవంత్ సభ కోసం 180 ఎకరాల పంట ధ్వంసం?”
అభిమాని కోసం హనుమకొండకు పవన్ కళ్యాణ్!
అనురూప్ రెడ్డి త్యాగానికి సీఎం రేవంత్ రెడ్డి సాల్యూట్!
Rain Alert
తెలంగాణకు భారీ వర్ష సూచన..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions